BDK: మణుగూరు మున్సిపల్ కమిషనర్‌కు BRS పార్టీ యూత్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్ శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మణుగూరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య సమస్యలకు నిలయంగా మారిందని, డ్రైనేజీ సకాలంలో శుభ్రం చేయక దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, తక్షణమే సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టి సమస్యలను నివారించాలని కోరారు.