WGL: నగరంలోని కాశిబుగ్గలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని, కుక్కలు దాడుల్లో ఇటీవల పలువురు గాయపడిన ఘటనలు సైతం ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు విషయాన్ని గమనించి శునకాల బెడద తీర్చాలని కోరుతున్నారు.