ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును సందర్శించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు మరియు రిజిస్టర్లను పరిశీలించారు. యంత్రాల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.