SRCL: వేములవాడ పట్టణ పరిధిలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నట్లు చెప్పారు.