ADB: ఇచ్చోడ మండలంలోని ముక్రా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరత్వాడకు చెందిన విఠల్ అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. 108 సిబ్బంది అలీమ్, కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది.