NZB: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మందిరం వద్ద మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారిని వరుస క్రమంలో దర్శించుకుంటూ పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు వివరించారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.