PLD: జిల్లా మహానాడు కార్యక్రమం నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాలులో బుధవారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు జరిగే మహానాడును విజయవంతం చేయాలని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.