ప్రకాశం: మార్టూరులోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని నియోజకవర్గం నలుమూలల నుంచి సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచవద్దని సూచించారు.