SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం ఇస్తాలపురంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 1983-84 బ్యాచ్ ఏడవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏడవ తరగతి చదివిన విద్యార్థులు 41 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనాటి విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి జ్ఞాపకాలను పంచుకొని ఆనందంగా గడిపారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.