CTR: చిత్తూరు నగర పాలక పరిధిలోని 50 వార్డులకు సంబంధించి టీడీపీ కమిటీలను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 50 వార్డులకు అద్యక్ష, కార్యదర్శులతో సహా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల మాట్లాడుతూ.. నూతన కమిటీలు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలన్నారు.