కృష్ణా: మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షునిగా లోగిశెట్టి స్వామి, ప్రధాన కార్యదర్శిగా బచ్చుల అనిల్ నియమితులయ్యారు. బుధవారం నిర్వహించిన మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర వీరి ఇరువురి పేర్లను ప్రకటించారు. లోగిశెట్టి స్వామి, బచ్చుల అనిల్ గతంలో టీడీపీ కౌన్సిలర్లుగా వ్యవహరించారు. వీరి నియామకం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.