NTR: ఉపాధి హామీ పథకం ఆసరాతో ఉచితంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సుచించారు. కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంతో పాటు పశుగ్రాసం పెంపకానికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయాలు లభిస్తాయని అన్నారు.