సత్యసాయి: సోమందేపల్లి మండల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సోమందేపల్లిలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామస్థులు శోభయాత్ర నిర్వహింనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హిందు, ముస్లిం సోదరులు అన్నదమ్ములాగా కలిసి మెలిసి పండగ జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.