HYD: దారుస్సలాంలోని MIM పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రజల సమస్యలు, అభ్యర్థనలు ఎప్పుడూ గౌరవంగా స్వీకరిస్తున్నట్లు అక్బరుద్దీన్ తెలిపారు. సమగ్ర పరిష్కారాల కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.