ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, ఏకపక్ష ఎన్కౌంటర్లు అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖ రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని, కేంద్రం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఆయన కేంద్రాన్ని కోరారు.