NLR: కావలి పట్టణంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర వైసీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి, మాజీ కౌన్సిలర్, 33వ వార్డ్ వైసీపీ ఇంఛార్జ్ అమర యాదగిరి పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రేయభిలాషులు, వార్దు సభ్యులతో చర్చించి ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.