ASR: అనంతగిరి మండలం కాశీపట్నం వారపుసంతలో బుధవారం ఎయిడ్స్, టి.బి నియంత్రణపై కళాజాతతో మన్యసీమ కళాబృందం గిరిజనులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్, టీ.బి వ్యాధి బారి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారపు సంతకు వచ్చిన గిరిజనులకు వివరించారు.