సత్యసాయి: లేపాక్షి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుర్వేదిక వైద్యశాలను జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ గోడను శుభ్రంగా ఉంచాలని సూచించారు. డాక్టర్లు స్థానికంగానే ఉన్నారా లేదా అని ప్రత్యేకంగా విచారించారు.