ATP: జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరవకొండ, బెలుగుప్ప మండలాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇవాళ రాత్రి 7 గంటల సమయానికి జిల్లాలోని చిన్నమూష్టరులో అత్యధికంగా 51.5 మి.మీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.