కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో జూన్ 5-8 తేదీలలో “మసూలా ఫెస్ట్-2025” జరగనుంది. బీచ్ కబడ్డీ, వాలీబాల్, జలక్రీడలతో అంతర్జాతీయ స్థాయిలో ఫెస్ట్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు శాప్ ఛైర్మన్ అనిమినీ రవినాయుడు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర సూచనలతో ఏర్పాట్లు జరుగుతున్నాయని, బీచ్‌ను పరిశీలించామని వెల్లడించారు.