VZM: శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి బుధవారం తెలిపారు. సుమారు 900 మంది పోలీసు బందోబస్తు పటిష్ఠ ప్రణాళికలతో సజావుగా జరిగినట్లు చెప్పారు. సిరిమానోత్సవం ముగిసిన తరువాత ఇబ్బందులు తలెత్తకుండ బారికేడ్లను తొలగించమన్నారు.