KDP: తొండూరు మండలం రామాలయంలో జరుగుతున్న భాగవత సహస్త కార్యక్రమంలో బుధవారం రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఇది భగవంతుని కథే కాకుండా భగవంతునికి శరణాగతమైన భక్తుల కథగా భక్తి యోగాన్ని చాటి చెప్పే గొప్ప గ్రంథం అని ఆయన అన్నారు. ఇలాంటి గొప్ప గ్రంధాన్ని చదవడం పుణ్య కారణమన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.