TG: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎంతో మంది మాజీ సీఎంలు జైలుకు వెళ్లారని.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.