మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ హత్య చేసిందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రతను పరిశీలిస్తే పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. కాగా.. నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగంలో చేరినట్లు తేలడంతో పూజా ఖేడ్కర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.