ప్రకాశం: మార్కాపురం కంభం రోడ్డు శివాజీ నగర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు అంటున్నారు. మురికి కాలువకు ఒకవైపున ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీని కింద ఉన్న దిమ్మె నెర్రెలిచ్చి ప్రమాదకరంగా ఉందని, దానికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదం జరుగుతుందేమోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.