బాపట్ల: నిషేధ కాలంలో చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెంకట మురళి బుధవారం హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు చీరాల మండలంలోని వాడరేవు సముద్ర ప్రాంతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారని సమాచారంతో కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. చట్ట విరుద్ధంగా చేపల వేట సాగిస్తున్న వారిని అడ్డుకోవాలని అన్నారు.