JGL: గోవధ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్లో బుధవారం పీస్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ స్లాటర్ యాక్ట్ 1977 ప్రకారం ఆవులు, దూడల వధ నిషిద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.