ప్రకాశం: కనిగిరి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ డిపో వద్ద వరకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే బుధవారం పామూరు బస్టాండ్ వరకు ప్రధాన రహదారి వెంబడి ఉన్న డ్రైనేజీ కాలువలలోని పూడికలను తీయించారు.