ATP: అనంతపురం జిల్లా జడ్పీ ఛైర్మన్ చాంబార్ను ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకట ప్రసాద్, అలిమినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బుధవారం పరిశీలించారు. జడ్పీ ఛైర్మన్ ఛాంబార్లో నేటికీ మాజీ సీఎం జగన్ ఫొటో ఉండటం చూసి జడ్పీ సీఈఓపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫొటో ఎందుకు ఉంచారని జడ్పీ అధికారులపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు.