SRCL: 30 రోజులలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేటలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎల్లారెడ్డిపేట మండలంలో రెండో విడతలో 643 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వివరించారు.