కాలిఫ్లవర్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.