సత్యసాయి: పెనుకొండ మండలం టీడీపీ కార్యాలయంలో బుధవారం ‘మినీ మహానాడు’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి హాజరయ్యారు. ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.