AP: విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు.