BDK: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం ములకలపల్లి మండలం రైతు వేదికలో మండలంలో రైతు వారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ములకలపల్లిలో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నూతన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సంతోషకరమన్నారు.