WGL: నగరంలోని కాశిబుగ్గ చౌరస్తా సెంటర్ వద్ద మంగళవారం బాటసారులకు అంబలి పంపిణీ కార్యక్రమం జరిగింది. వంగరి పరపతి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ పద్మ బ్రాహ్మణ జ్యోతిష్యులు వెల్దండి ఓంకార్ హాజరయ్యారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు.