KMR: సమగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేళ్లు ప్రకటించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం డిమాండ్ చేశారు. కామారెడ్డిలో జరుగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి సోమవారం హాజరై మాట్లాడారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా గుర్తించి విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు.