MDK: నారాయణఖేడ్ మండలం సంజీవన రావుపేట్ గ్రామంలో సోమవారం దుర్గామాత ఆలయంలో అఖండ హరినామ సప్తహం ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి శ్రీ గురువర్యులు చంద్రశేఖర్ మహారాజ్ కీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక దుర్గామాత ఆలయంలో ఏర్పాటు చేసిన మండపంలో భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తూ సాంప్రదాయ భజనలతో కీర్తన చేశారు.