ప్రముఖ నటుడు అడివి శేష్ హీరోగా షానీల్ డియో దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘డకాయిట్’. ఈ మూవీలో కథానాయికగా నటి మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, కథానాయికగా మొదట శృతి హాసన్ ఎంపిక కాగా.. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో మృణాల్‌ను మేకర్స్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది.