టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన సినిమా ‘రాబిన్హుడ్’. ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.