సత్యసాయి: పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆరో తరగతి చదువుతున్న 13మంది బాలికలు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కోలుకున్న వారిని వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నారు.