BHPL: రేగొండ మండలంలో సోమవారం BJP మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో బస్టాండ్ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆరోగ్య కేంద్ర సౌకర్యాలు, రేషన్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.