టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఘోర ప్రదర్శన చేస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్టులోనూ 10 పరుగులకే పెవిలియన్ చేరడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడని.. బ్రిస్బేన్ టెస్టులో ఔటయ్యాక గ్లౌవ్స్‌ను డగౌట్ దగ్గర విడిచిపెట్టడం రిటైర్మెంట్ సంకేతాలను సూచిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత 14 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.