VZM: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 85 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 8.50 లక్షల ఫైన్‌ను ఒకే రోజు కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు.