MNCL: కాసిపేట మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. అంగడి బజార్‌కు చెందిన ప్రశాంత్ (45) శనివారం నీటి కోసం మోటర్ ఆన్ చేశాడు. నీళ్లు రాకపోవడంతో వైరును పట్టుకొని మోటార్ కదిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ప్రియదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.