MDK: జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకో కార్యక్రమాన్ని బడిబాటలో నిర్వహించాలని చెప్పారు. బడిబాట నిర్వాణ కోసం మండల విద్యాధికారులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని సూచించారు.