KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం మే 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 20న గణపతి పూజ పుణ్యాహవాచనం, ద్వజారోహణ, అంకురార్ప పంచామృతాభిషేకం, ఆకు పూజ, అర్చన, మంగళ హారతి వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.