PPM: సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలను అడిషనల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జే.సౌమ్య జోషఫిన్ శనివారం పరిశీలించారు. జిల్లా న్యాయ సేవా సాధికారిత సంస్థ ఆదేశాల మేరకు పరిశీలన జరిగిందన్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం కళాశాల బాలికల బీసీ వసతి గృహం, ఎస్సీ వసతి గృహం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహం తనిఖీ చేశారు.