VZM: ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించకుండా ఆసుపత్రిని అక్కడే కొనసాగించడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న ఆసుపత్రి నగరం మధ్యలో ఉంటూ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. శనివారం కలెక్టరేట్లో మంత్రి వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.