VZM: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్సై మహేష్ శనివారం సాయంత్రం చెప్పారు. బొండపల్లి మండలం బోడసింగిపేట ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.