AP: బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా 2024 ఎన్నికల్లో YCP తప్పు చేసిందని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో NDA తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చామని చెప్పారు. కానీ చివరకు బీజేపీకి దూరమై.. నష్టపోయామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందామని పార్టీకి సూచించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తుది నిర్ణయం జగన్‌దేనని అన్నారు.